పరిచ్ఛేదం

 పత్రికల్లో T.Vల్లో రకరకాల ఇంటర్వ్యూలను చూస్తుంటాం. ఇంటర్వ్యూలు రెండు రకాలు. ఉద్యోగానికి, పై చదువుల ఎంపిక కోసం అభ్యర్థి ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించడానికి చేసేది ఒకరకం. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోవడానికి చేసేది రెండవ రకం. ఇంటర్వ్యూను తెలుగులో మౌలిక పరీక్ష ముఖాముఖి అనే పేర్లతో సంబోధిస్తారు ఉద్యోగాన్ని సంపాదించడానికి అభ్యర్థులు పూర్తి సంసిద్ధతతో వెళ్తారు. ఉద్యోగ ఎంపికలో ఈ ప్రక్రియను చివరి దశగా భావించవచ్చు. ఈ దశలో అభ్యర్థి బాగా రాణిస్తే అతడి | జీవిత "దశ” తిరిగినట్లే కొందరు అభ్యర్థులు ఇంటర్వ్యూ అనేసరికి చతికిల పడుతున్నారు. ఈ బిడియానికి, కారణాలను అన్వేషించి చూస్తే, ఇంటర్వ్యూ అంటే అదో న్యూనతా భావంలా మారిందన్న విషయము తేలింది. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు కొందరు అభ్యర్థులను ఒత్తిడికి గురిచేసి, అనవసరపు ప్రశ్నలతో బెదరగొట్టడం, భయపెట్టడం, వంటివి చేస్తున్నారని ద్యోగార్థులు వాపోతున్నారు. సమర్థత, సమయస్ఫూర్తి, ఆశావాదం వంటి లక్షనాలతో మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటే ఎటువంటి ఇంటర్వ్యూనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చనేది విజేతల మనోగతం, నీతి, నిజాయితీల పునాదులపై ఇంటర్వ్యూలు లి జరిగితే న్యాయానికి, అన్యాయం జరగదని నా అభిప్రాయం - ఉ ఇప్పటికాలంలో అటువంటి విలువలను పాటిస్తూ ఇంటర్వ్యూలు తి | జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? భావిస్తే అవును అనండి. భావించకపోతే "లేదు" అనండి. “చెప్పలేం" అంటే క్ "తటస్థం" అని అనండి ప్రముఖ, గొప్పవారి నుండి వారి వివరాలను విశేషాలను తెలుసుకోవడానికి చేసేది రెండోరకం ఇంటర్వ్యూ . ఇందులో స్ఫూర్తి, ప్రేరణలు అంతర్భాగమై ఉంటాయి. దీనిలో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తి కీలకం. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారుచేసుకుంటారు. మొదట వారిని పరిచయం చేసుకొని, వారి వ్యక్తిగత వివరాల నుండి మొదలైన జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు అనుభవాలు, జ్ఞాపకాలు, అందించిన సందేశాలు వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించి సమాజానికి అందిస్తారు.